
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వాడుతున్న భాషపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సెంటిమెంట్ అడ్డుపెట్టుకుని, ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కొడుకునన్న అహంకారం కేటీఆర్లో పెరిగిపోయిందని, అందుకే ప్రతిపక్షాలను బూతులు తిడుతున్నారని అన్నారు. కేసీఆర్ చరిత్ర అందరికీ తెలుసన్న రాజగోపాల్.. రిటైర్మెంట్కు టైం దగ్గర పడటంతోనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో తనలాంటి ఎంతోమంది పార్టీలకతీతంగా మద్దతు పలికితేనే ఇప్పుడు కేసీఆర్ కుటుంబం బాగుపడిందని అన్నారు.