ఎగుమతిదారులకు రూ.7 వేల 295 కోట్ల లోన్లు.. లోన్ల వడ్డీ పైనా రాయితీ

ఎగుమతిదారులకు రూ.7 వేల 295 కోట్ల లోన్లు.. లోన్ల వడ్డీ పైనా రాయితీ

న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు రుణ సదుపాయం పెంచేందుకు ప్రభుత్వం రూ.7,295 కోట్ల ఎగుమతి మద్దతు ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో రూ.5,181 కోట్ల వడ్డీ రాయితీ పథకం, రూ.2,114 కోట్ల కొలేటరల్ సపోర్ట్ ఉన్నాయి. వీటిని 2025 నుంచి 2031 మధ్య ఆరేళ్ల కాలంలో అమలు చేస్తారు. వడ్డీ రాయితీ పథకం కింద ఎగుమతిదారులు షిప్మెంట్ ముందు, తర్వాత తీసుకునే లోన్లపై రాయితీ పొందుతారు. ఎంఎస్ ఎంఈ ఎగుమతిదారులకు 2.75 శాతం వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది.

ఏడాదికి ఒక సంస్థకు రూ.50 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. దీనికి సంబంధించి ఆర్బీఐ. డీజీఎన్టీ విధివిధానాలను విడుదల చేస్తాయి. ఎంఎస్ఎంఈ సంస్థల వర్కింగ్ క్యాపిల్ లోన్ల కోసం రూ.10 కోట్ల వరకు కొలేటరల్ గ్యారెంటీని ప్రభుత్వం అందిస్తుంది. రక్షణ, స్కామెట్ ఉత్పత్తులకు ఈ మద్దతు వర్తిస్తుంది. నియంత్రణలో ఉన్న వస్తువులు, వ్యర్థాలు, పీఎల్ ఐ పరిధిలో ఉన్న వస్తువులకు ఈ ప్రయోజనాలు వర్తించవు.