చిక్కుల్లో శ్రీ సిమెంట్ విచారణకు కేంద్రం ఆదేశం

చిక్కుల్లో శ్రీ సిమెంట్ విచారణకు కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ: శ్రీ సిమెంట్ పై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశిం చింది. కంపెనీ వ్యవహారాలకు సంబంధించి సమాచారం ఇవ్వాలని కోరుతూ రీజినల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి లెటర్ వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కంపెనీ కంపెనీల చట్టం 2013 లోని సెక్షన్ 210(1) (సి) కింద ఈ విచారణ జరుగుతోంది. విచారణకు గల కచ్చితమైన కారణాలను సంస్థ వెల్లడించలేదు. 

ప్రభుత్వానికి అవసరమైన సమాచారాన్ని నిర్ణీత సమయంలో అందజేస్తామని సంస్థ తెలిపింది. ఈ పరిణామం వల్ల కంపెనీ ఆ ఆర్థిక లేదా వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. శ్రీసిమెంట్ దేశంలోనే మూడో అతిపెద్ద సిమెంట్ కంపెనీ.