- ఎమ్మెల్యే రోహిత్ రావు
మెదక్, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును ఎమ్మెల్యే రోహిత్ రావు తీవ్రంగా ఖండించారు. మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో మంగళవారం నిర్వహించిన దీక్షలో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత పేద కూలీలకు ఉన్న ఊరులో ఉపాధి కల్పించేందుకు గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకానికి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా గాంధీ పేరు పెడితే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఆ పేరు తొలగించడం, ఉపాధి హామీ కూలీల పని గంటలను తగ్గించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఉపాధి హామీ పథకం పేరును కొనసాగిస్తూ పని గంటలను పెంచాలని డిమాండ్ చేశారు.
డీసీసీ ప్రసిడెంట్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు మధుసూదన్ రావు, అమర సేనారెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, మాజీ కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
