
నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాకు మరో అదృష్టం కలిసొచ్చింది. ఆమె భర్త, దర్శకుడు సెల్వమణికి కీలక పదవి దక్కింది. ఆయన తమిళనాడు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో గెలిచి.. అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. తోటి తమిళ దర్శకుడు విద్యాసాగర్‌పై 1386 ఓట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. సెల్వమణిని పలువురు సినీ ప్రముఖులు అభినందించారు.
రోజా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే సెల్వమణి కూడా ఇండస్ట్రీలో కీలకమైన సినీ దర్శకుల సంఘం అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. రోజా వరుసగా రెండు గుడ్‌న్యూస్ లు విన్నారు.