
దేశ ప్రజలను ప్రధాని మోడీ మోసం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. నిత్యవసర ధరలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. తలపై గ్యాస్, కట్టెలు పెట్టుకుని నిరసనకు దిగారు. ఈ సందర్బంగా మాట్లాడిన సీతక్క.. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్యాస్ ధరలు చూసి.. మళ్లీ పబ్లిక్ కట్టెల పొయ్యి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. గ్యాస్ తోపాటు పెట్రోల్ ధరలు సామాన్య , మధ్య తరగతి కుటుంబాలకు గుది బండగా మారాయన్నారు. అదానీ, అంబానీలకు మోడీ దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.