
సీఎం కేసీఆర్ పాలనలో పేదలకు న్యాయం జరగడం లేదన్నారు ఎమ్మెల్యే సీతక్క. పేదల కష్టం దోచుకొని పెద్దలకు పంచుతున్నారని మండిపడ్డారు. రైతు బంధు పేరుమీద మంత్రి మల్లారెడ్డి 60 లక్షలు తీసుకుంటున్నారని... 4 సంవత్సరాల్లో 2 కోట్ల 40 లక్షలు తీసుకున్నారన్నారు. చిన్న అటెండర్ కుటుంబానికి పెన్షన్ ఇవ్వలేని ప్రభుత్వం.. మంత్రులకు మాత్రం లక్షల రూపాయల రైతుబంధు ఇస్తోందని మండిపడ్డారు.