
హైదరాబాద్: ఇటీవల చనిపోయిన తెలంగాణ నాగులు కుటుంబాన్నిప్రభుత్వం ఆదుకోవాలన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. సోమవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆమె..తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గౌరవించాలన్నారు. హోం మినిష్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీతక్క.. సభాముఖంగా నాగులుకు నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. ఒక ఉద్యకారుడు చనిపోతే కనీసం లోకల్ లీడర్స్ కూడా నివాళులర్పించకపోవడం దారుణమన్నారు. తెలంగాణ నాగులు చనిపోయాక అతడి శరీరంపైన కూడా టీఆర్ఎస్ కండువానే కప్పారని.. అయినా సరే ఒక్క టీఆర్ఎస్ నేత కూడా నాగులు కుటుంబాన్ని పరామర్షించలేదన్నారు సీతక్క.
కరోనా వల్ల అన్ని రంగాల్లో తీవ్రమైన నష్టం కలిగిందని.. తక్షణమే ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు సీతక్క. ప్రజా సమస్యలపై సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ బాగుంటే .. అసెంబ్లీ ఎందుకని..అన్నీ డబ్బాలు కొట్టుకోవడానికే టీఆర్ఎస్ నేతలు సభ సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే సీతక్క.