రూ.9.90 కోట్లతో  తిరుమలగిరి లేక్ పునరుద్ధరణ : ఎమ్మెల్యే శ్రీగణేశ్

 రూ.9.90 కోట్లతో  తిరుమలగిరి లేక్ పునరుద్ధరణ : ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు-7 పరిధిలోని తిరుమలగిరి చెరువు పునరుద్ధరణ, సుందరీకరణతో పాటు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే శ్రీగణేశ్ శుక్రవారం ప్రారంభించారు. రూ.9.90 కోట్లతో చేపట్టనున్న చెరువు పునరుద్ధరణతో పరిసర కాలనీలు, బస్తీల ప్రజలకు మేలు జరుగుతుందని, ఎస్టీపీ ద్వారా మురుగు నీటిని శుద్ధి చేసి చెరువులోకి వదలడం వల్ల దోమల బెడద తగ్గుతుందన్నారు. సుందరీకరణలో భాగంగా ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు.  కంటోన్మెంట్ బోర్డు నుంచి ఎన్​వోసీ లభించడంతో హెచ్‌‌ఎండీఏ ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నట్లు వివరించారు.