పనిచేసిన వారికి పార్టీలో  సముచిత స్థానం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పనిచేసిన వారికి పార్టీలో  సముచిత స్థానం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు :  కాంగ్రెస్​ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం లభిస్తుందని, కార్యకర్త నుంచి నాయకుని వరకు ప్రతి ఒక్కరూ పార్టీ అప్పగించే పనులను  తప్పకుండా చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ప్లానింగ్​ బోర్డు వైస్​చైర్మన్ చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డిలతో కలిసి శ్రీరంగాపురం మండల కమిటీ ఏర్పాటు సమావేశాన్ని నిర్వహించారు.  

 గ్రామాల్లో బూత్ స్థాయి అధ్యక్షులను  నియమిస్తున్నామని,  గ్రామ అధ్యక్షుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని వారు గ్రామ సర్పంచ్ తో సమానమని అన్నారు.  ఒక్కొక్క కమిటీలో 21 మంది ఉంటారని ఆ విధంగా కమిటీ ఏర్పాటు ఉంటుందన్నారు.  అందరూ ఒకటే మాటగా ఉంటూ ముందుకెళితే దేన్నైనా సాధిస్తామని  అన్నారు.  కార్యక్రమంలో  శ్రీరంగాపూరు  సర్పంచ్ మద్దిలేటి, పార్టీ జిల్లా, మండల నాయకులు  రాజేంద్రప్రసాద్ యాదవ్,  రాములు యాదవ్,  నందిమల్ల యాదయ్య పాల్గొన్నారు.