ఎమ్మెల్యే అంకుల్.. రోడ్డు ఎప్పుడు వేస్తరు?

ఎమ్మెల్యే అంకుల్.. రోడ్డు ఎప్పుడు వేస్తరు?

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ తన సొంత ఊరిని పట్టించుకోకుండా, నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామని చెబుతూ ‘పట్టణ ప్రగతి’లో ఫొటోలకు పోజులు ఇస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్​ లీడర్​ కూన శ్రీశైలంగౌడ్ విమర్శించారు. కుత్బుల్లాపూర్​లోని మోడీ బిల్డర్స్ రోడ్డుకు రిపేర్లు చేయాలని కోరుతూ మోడీ సిల్వర్​ స్పింగ్ అపార్ట్​మెంట్​వాసులు సోమవారం నిరసన ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో స్థానిక చిన్నారులు పాల్గొని ‘ఎమ్మెల్యే అంకుల్, కేటీఆర్ ​అంకుల్ మాకు రోడ్డు ఎప్పుడు వేస్తున్నారు’అనే ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వివేకానంద్​ప్రజా సమస్యలను గాలికొదిలేసి, తాను విద్యావంతుడినని విర్రవీగుతూ తిరుగుతున్నాడని మండిపడ్డారు. వారం రోజుల్లో రోడ్డుకు రిపేర్లు చేయకుంటే జోనల్ కమిషనర్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అపార్ట్​మెంట్ వాసులు, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.