కఠోర శ్రమతోనే విజయాలు సాధ్యం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కఠోర శ్రమతోనే విజయాలు సాధ్యం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • అంబేద్కర్​ స్కూల్​ ‘పది’ స్టూడెంట్లకు అభినందన

ముషీరాబాద్, వెలుగు: కఠోర శ్రమతోనే విజయాలు సాధ్యమవుతాయని చెన్నూరు ఎమ్మెల్యే, కాకా డాక్టర్ బీఆర్​అంబేద్కర్ ఇన్ స్టిట్యూషన్ చైర్మన్ వివేక్ వెంకటస్వామి చెప్పారు. పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హైస్కూల్ స్టూడెంట్లను గురువారం కరస్పాండెంట్ డాక్టర్ సరోజా వివేక్, జాయింట్ సెక్రెటరీ పీవీ రమణరావుతో కలిసి సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రతిభను మరింతగా నిరూపించుకొని సమాజానికి, దేశానికి సేవ చేయాలని సూచించారు. 

కష్టపడే తత్వం ఉంటే విజయానికి చేరువవుతారని చెప్పారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. కరస్పాండెంట్ సరోజా వివేక్ మాట్లాడుతూ.. అంబేద్కర్​ఇనిస్టిట్యూట్ స్టూడెంట్లను ప్రోత్సహిస్తూ పై చదువులకు తమ వంతు సహకారం అందిస్తున్నామన్నారు. బాగా చదువుకొని ఇనిస్టిట్యూట్​తోపాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.