
- ఎల్లంపల్లి నుంచి వెంటనే విడుదల చేయండి.. పంటలను కాపాడండి
- అసెంబ్లీలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రస్తావన
హైదరాబాద్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలో పంటలను కాపాడేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీల నీళ్లు విడుదల చేయాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. శనివారం అసెంబ్లీలో జీరో అవర్ లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఈ అంశాన్ని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు.
‘‘గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో 8 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 12 టీఎంసీలు ఉన్నాయి. వెంటనే నీళ్లు రిలీజ్ చేస్తే పంటలను కాపాడుకోవచ్చు. నీళ్లు విడుదల చేసేలా ఇరిగేషన్ మంత్రి ఆదేశాలు ఇవ్వాలి” అని వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ప్రశ్నను నోట్ చేసుకున్నామని, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు బదులిచ్చారు.