జాతీయ సమైక్యతా ర్యాలీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టెప్పులు

జాతీయ సమైక్యతా ర్యాలీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టెప్పులు

 రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యతా వేడుకలను టీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, విద్యార్థులు ఈ ర్యాలీల్లో పాల్గొంటున్నారు.  జీడిమెట్లలో కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో ఇండియన్ ఐడల్ శ్రీరామ్ పాడిన మాయాదారి మైసమ్మ  పాటకి ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు స్టెప్పులేశారు. 

కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వరకు సుమారు 15 వేల మంది విద్యార్థులు, స్థానికులతో ఈ ర్యాలీ నిర్వహించారు. అయతే ర్యాలీ సందర్భంగా కాసేపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.