ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కృషితోనే ట్రిపుల్ ఐటీ : ఆనంద్గౌడ్

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కృషితోనే ట్రిపుల్ ఐటీ : ఆనంద్గౌడ్

మహబూబ్​నగర్​ అర్బన్​, వెలుగు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి కృషితోనే మహబూబ్​నగర్​కు ట్రిపుల్​ఐటీ వచ్చిందని మున్సిపల్​మాజీ చైర్మన్​ఆనంద్​గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు శుక్రవారం నగరంలోని వీరన్న పేట, కుమ్మరివాడి, బోయపల్లి, అప్పన్నపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఎమ్మెల్యే తన సొంత నిధులతో అందిస్తున్నారని తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ట్రిపుల్​ఐటీ వంటి ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీట్లు సాధించాలని ఆకాంక్షించారు.