ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకే ఫండ్స్‌‌

ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకే ఫండ్స్‌‌
  • యాదాద్రి జిల్లాకు రూ. 108.75 కోట్లు స్పెషల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ మంజూరు
  • జిల్లా వ్యాప్తంగా 2,430 పనులను గుర్తించిన ఆఫీసర్లు
  • ఎమ్మెల్యేలు చెప్పిన పేర్లతోనే తీర్మానాలు చేస్తున్న సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు

యాదాద్రి, వెలుగు : ‘స్పెషల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ కింద చేపట్టిన పనులను ఎవరికి ఇవ్వాలో నేనే చెబుతా.. వారి పేర్లతోనే తీర్మానాలు చేయండి, ఇందులో మరో మాటకు తావు లేదు, నేను చెప్పిందే ఫైనల్‌‌‌‌‌‌‌‌’ ఇవి యాదాద్రి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సర్పంచ్‌‌‌‌‌‌‌‌తో అన్న మాటలు. పనులను తామే చేసుకుంటామని ఎమ్మెల్యేను ఒప్పించేందుకు సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు ప్రయత్నించినా కుదరకపోవడంతో విధిలేక ఎమ్మెల్యేలు చెప్పిన పేర్లతోనే తీర్మానాలు చేసి ఇచ్చేశారు. ఈ  ఫండ్స్‌‌‌‌‌‌‌‌తో చేపట్టిన పనులను ఎమ్మెల్యేలు తమ ఇష్టం వచ్చిన వారికి అప్పగిస్తున్నారు. ఇందులో కొందరు తామే సొంతంగా పనులు చేస్తుండగా, మరికొందరు పర్సంటేజీ మాట్లాడుకొని మరొకరికి అమ్మేసుకుంటున్నారు. 

రూ.108 కోట్లు.. 2,430 పనులు

స్పెషల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ కింద యాదాద్రి జిల్లాకు మొత్తం రూ. 108.75 కోట్లు మంజూరు అయ్యాయి. ఇందులో 421 పంచాయతీలకు రూ. 25 లక్షల చొప్పున 105.25 కోట్లు, భువనగిరి మున్సిపాలిటీకి రూ. కోటి, మోత్కూరు, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌, భూదాన్‌‌‌‌‌‌‌‌పోచంపల్లికి రూ. 50 లక్షల చొప్పున రూ. 2.50 కోట్లు రిలీజ్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. ఈ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్‌‌‌‌‌‌‌‌ నిర్మించాలని నిర్ణయించారు. అయితే రూ. 5 లక్షలలోపు ఖర్చయ్యే పనులకు టెండర్లు పిలవాల్సిన అవసరం లేకపోవడం, తమకు నచ్చిన వారికి
కేటాయించుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉండడంతో అన్ని పనులు ఆ లోపే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,430 వర్క్స్‌‌‌‌‌‌‌‌ను గుర్తించారు. రూ. 5 లక్షలతో ఎంతవరకు అయితే అంత వరకే  చేసేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేశారు. మరికొన్ని చోట్ల ఇప్పటికే సగం పూర్తైన నిర్మాణాలకు ప్రస్తుతం మరికొన్ని నిధులు కేటాయించారు.

ఎమ్మెల్యేలు చెప్పిన పేర్లే ఫైనల్‌‌‌‌‌‌‌‌

జిల్లాకు పెద్దమొత్తంలో నిధులు విడుదల కావడంతో పనులను దక్కించుకునేందుకు సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లతో పాటు కాంట్రాక్టర్లు సైతం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. రూ. 5 లక్షల్లోపు  పనులను కేవలం పంచాయతీ తీర్మానంతో చేసుకునే అవకాశం ఉండడంతో దీన్ని ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా మలుచుకున్నారు.  ఈ పనులను తామే చేసుకుంటామని సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు ఎమ్మెల్యేలను కోరినా వారు ససేమిరా అన్నట్లు తెలిసింది. ‘అన్ని పనులు మీకే ఇస్తే ఎలా ? పార్టీ కార్యకర్తలున్నారు.. మాకు కావాల్సిన వారు ఉన్నారు.. వారంతా ఏం కావాలి’ అని ప్రశ్నించినట్లు సమాచారం. తాము చెప్పిన పేర్లతోనే తీర్మానాలు చేసి పంపాలని ఆదేశించడంతో సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు సైతం ఆ పేర్లనే ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

పర్సంటేజీకి అమ్ముకుంటున్న లీడర్లు

పనులు రూ. 5 లక్షల్లోపే ఉండేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేయడంతో గ్రామాల్లో ఐదు, మున్సిపాలిటీలో 10 వరకు పనులు చేపట్టే అవకాశం ఏర్పడింది. ఎమ్మెల్యే సహకారంతో పనులు దక్కించుకున్న కొందరు లీడర్లు సొంతంగా 
పనులు చేసేందుకు మొగ్గు చూపారు. మరికొందరు మాత్రం 5 నుంచి 10 శాతం కమీషన్‌‌‌‌‌‌‌‌కు మరొకరికి అమ్ముకున్నట్లు తెలుస్తోంది. అలాగే మోత్కూరు, భువనగిరి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో కొందరు వ్యక్తులే మొత్తం పనులు దక్కించుకున్నట్లు సమచారం. 
చౌటుప్పల్, నారాయణపురంలో 

కొత్త పంచాయితీ

యాదాద్రి జిల్లాలోని 15 మండలాల్లో ఎమ్మెల్యేలు చెప్పిన వారికే వర్క్స్‌‌‌‌‌‌‌‌ దక్కగా, మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌, సంస్థాన్‌‌‌‌‌‌‌‌నారాయణపురం మండలాల్లో మాత్రం మరో రకమైన పంచాయితీ నెలకొంది. ఇక్కడ పనులు చేసేందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఓకే చెప్పినా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనుల విషయంలోనే  రెండు మండలాల సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు మీటింగ్‌‌‌‌‌‌‌‌లను సైతం బహిష్కరించారు.