కాళేశ్వరం కమిషన్‌‌ ముందు కేసీఆర్‌‌‌‌ హాజరు కావాలి..ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌‌‌‌ డిమాండ్

కాళేశ్వరం కమిషన్‌‌ ముందు కేసీఆర్‌‌‌‌ హాజరు కావాలి..ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌‌‌‌ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్‌‌‌‌ హాజరై తన నిజాయతీని నిరూపించుకుంటే పూలదండ వేసి ఆయనను సన్మానిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మంగళవారం గాంధీ భవన్‌‌లో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ పోలీస్‌‌ అధికారి ప్రభాకర్ రావు అమెరికా పారిపోయినట్లుగా కేసీఆర్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్లు ఉందని, అలా చేయొద్దన్నారు.

కాళేశ్వరం కమిషన్ కేసీఆర్, హరీశ్‌‌ రావు, ఈటల రాజేందర్‌‌‌‌కు నోటీసులిస్తే.. కొందరు తప్పుబడుతున్నారని మండిపడ్డారు. ఈ ముగ్గురు తప్పుచేసినట్లు తేలితే జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. అప్పటి సీఎంగా కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌‌, ఆర్థిక మంత్రిగా ఈటల.. కమిషన్‌కు వివరణ ఇవ్వాలన్నారు.