
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యాసన సంక్షోభం (లెర్నింగ్ క్రైసిస్) నెలకొందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, గిరిజన సంక్షేమ పాఠశాలల మనుగడకు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
సమావేశంలో అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా తయారవుతుందన్నారు. వాస్తవంగా విద్యార్థుల నమోదు, అభ్యసన సంక్షోభం ఏర్పడిందని తెలిపారు. సమావేశంలో వేదిక ప్రధాన కార్యదర్శి ఎం రాధేశ్యాం, జగ్గయ్య, లక్ష్మారెడ్డి, సింహాచలం, వెంకటేశ్, సోమయ్య, అరుణ జ్యోతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.