బొల్లారం పోలీస్ స్టేషన్ తరలింపు ఆపండి..డీజీపీకి ఎమ్మెల్సీ అంజిరెడ్డి వినతి

బొల్లారం పోలీస్ స్టేషన్ తరలింపు ఆపండి..డీజీపీకి ఎమ్మెల్సీ అంజిరెడ్డి వినతి

 జిన్నారం, వెలుగు:  బొల్లారం పోలీస్ స్టేషన్ ను అమీన్ పూర్ కు తరలించే ప్రతిపాదనను వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బొల్లారం బీజేపీ నేత ఆనంద్ కృష్ణారెడ్డి కోరుతూ శుక్రవారం డీజీపీ శివధర్ రెడ్డి కి వినతి పత్రం అందించారు. 

బొల్లారం పోలీస్ స్టేషన్ ఎత్తివేయడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, పారిశ్రామికవాడగా ఉన్న ఆ ప్రాంతంలో అనేక రాష్ట్రాల వ్యక్తులు నివసిస్తున్నారన్నారు.  అమీన్ పూర్ లో  కలిపితే సామాన్యులు, వృద్ధులు, మహిళలు కేసులు, ఫిర్యాదులు నిమిత్తం వెళ్లాలంటే ఇబ్బందులు పడతారన్నారు. శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగే ప్రమాదం ఉందన్నారు. బీజేపీ బొల్లారం నేతలు ఉన్నారు.