కరెంట్ బిల్లులు కట్టొద్దనడానికి..కేటీఆర్ ఎవరు? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కరెంట్ బిల్లులు కట్టొద్దనడానికి..కేటీఆర్ ఎవరు? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఏర్పడి 40 రోజులే అయిందని, గ్యారంటీలపై కేటీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామన్నారు. మిగిలిన గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. కరెంట్ బిల్లులు కట్టొద్దని చెప్పడానికి కేటీఆర్ ఎవరని, ఆయనకేం హక్కుందని నిలదీశారు. ఆదివారం ఆయన అసెంబ్లీలోని మీడియా హాల్​లో మాట్లాడారు.

 ‘‘మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. దావోస్ పర్యటనతో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు సాధించినం. వాటిని చూసి కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నడు. రాష్ట్రంలో అదానీ పెట్టుబడులు పెడితే తప్పేంటి? ఎప్పుడైతే టీఆర్ఎస్​ను బీఆర్ఎస్​గా మార్చిన్రో.. అప్పుడే మీ పార్టీ లేకుండా పోయింది’’ అని విమర్శించారు. తెలంగాణ ఏర్పడే నాటికి అప్పులు రూ.70వేల కోట్లు ఉంటే.. తొమ్మిదేండ్లలో రూ.7 లక్షల కోట్లకు పెంచారని ఫైర్ అయ్యారు. రూ.38 వేల కోట్లతో పూర్తవ్వాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును.. కమీషన్ల కోసం కాళేశ్వరం పేరుతో రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేశారని ఫైర్ అయ్యారు.