సింగరేణి మూసివేతకు కేంద్రం కుట్ర

సింగరేణి మూసివేతకు కేంద్రం కుట్ర

సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు గని కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ మణిమాణిక్యం సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు పన్నాగం పన్నుతున్నారని మండిపడ్డారు. సింగరేణిలో రాష్ట్రానికి 51శాతం,కేంద్రానికి 49శాతం వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోందని ఆమె మండిపడ్డారు. బీజేపీ వైఖరి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సంస్థ అద్భుతమైన పురోగతితో,దేశంలోని ఇతర సంస్థల కంటే ఎంతో గొప్పగా లాభాలు సాధించిందన్నారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల్లో ఉన్నట్టుగా చూపిస్తూ..4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసే వరకూ కార్మికుల పక్షాన గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత.

మరిన్ని వార్తలు

సీఎం కేసీఆర్ పై వెల్లువెత్తుతున్న నిరసనలు

హుజురాబాద్ ఓటమితో కేసీఆర్ దిమ్మతిరిగింది