సీఎం కేసీఆర్ పై వెల్లువెత్తుతున్న నిరసనలు

సీఎం కేసీఆర్ పై వెల్లువెత్తుతున్న నిరసనలు
  • కేసీఆర్ అంబేద్కర్ ను అవమానించారు.
  • ప్రతి పక్షాలు, ప్రజా సంఘాల  డిమాండ్

రాజ్యాంగాన్ని మార్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్లపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి పక్ష పార్టీలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యకమవుతోంది. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, బీఎస్పీ, దళిత సంఘాల నేతలు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే ముఖ్యమంత్రి అయ్యారన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు నేతలు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, ప్రొ.కోదండరాం, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 70 వేల పుస్తకాలు చదివానంటూ గొప్పలు చెప్పుకునే కేసీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ను మార్చే రోజులు దగ్గరపడ్డాయన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేసి కల్వకుంట్ల రాజ్యాంగం తెస్తారా అంటూ మండిపడ్డారు. 

 

ఇవి కూడా చదవండి..

కార్ల హెడ్లైట్ల కిందే ఎగ్జామ్ రాశారు