
బడ్జెట్, ప్రధానిపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబేద్కర్ ను అవమానించేలా రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ మాట్లాడటం దారుణమన్నారు. హుజురాబాద్ ఫలితాల తర్వాత కేసీఆర్ కు అభద్రతా భావం కనిపిస్తోందని..అందుకే టీఆర్ ఎస్ నేతలు అసహనంతో ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని..ఆయన టక్కు టమారా మాటలను తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మరన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా చెబుతున్న అబద్ధాలు నిజం కావని గుర్తుంచుకోవాలన్నారు కిషన్ రెడ్డి.
మరిన్ని వార్తల కోసం