టీచర్ పోస్టులను భర్తీ చేయండి

టీచర్ పోస్టులను భర్తీ చేయండి

తెలంగాణలో విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. పాఠశాలలు, కళాశాలలో ఉపాధ్యాయులు, అధ్యాపకులను భర్తీ  చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు, బోధన సిబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం పని చేస్తున్న విద్యా వాలంటీర్లను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేస్తూ... బషీర్​బాగ్​లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. మరోవైపు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ , ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో విద్యా వాలంటీర్లు ఆందోళన చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పని చేస్తున్న విద్యా వాలంటీర్లను ఎందుకు పర్మినెంట్ చేయడం లేదని ​కృష్ణయ్య ప్రశ్నించారు. కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ విద్యా ప్రమాణాలు పెంచుతున్న వారిపై ఉన్నతాధికారులు చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు అనే పదం లేకుండా చేస్తానన్న ముఖ్యమంత్రి మాట తప్పారని అన్నారు. విద్యా వాలంటీర్లను రెగ్యులర్ చేయాలని లేనిపక్షంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థి సంఘాలను ఐక్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ హెచ్చరించారు. ఢిల్లీ తరహాలో విద్యావవస్థను రాష్ట్రంలో ప్రవేశపెడితే విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగులు నీ ఫాం హౌస్ కూలీలు కాదు

మాటలు కోటలు దాటుతాయి కానీ, చేతలు మాత్రం గడపదాటవు