మాటలు కోటలు దాటుతాయి కానీ, చేతలు మాత్రం గడపదాటవు

మాటలు కోటలు దాటుతాయి కానీ, చేతలు మాత్రం గడపదాటవు

హైదరాబాద్ విశ్వనగరం కాదు విషవాయువుల నగరంగా మారుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలిస్తామన్న ప్రభుత్వ మాటలు ఏండ్లైనా అమలు కావడంలేదని ఆయన ఎద్దేవాచేశారు. కల్వకుంట్ల వారి మాటలు కోటలు దాటుతాయి కానీ, చేతలు మాత్రం గడపదాటవన్న భావన మరోసారి రుజువైందని ఆయన అన్నారు. యార్డును తరలించి ప్రజల ఆరోగ్యాలను కాపాడతారా లేక నిరసన సెగలకు సిద్ధపడతారా? అని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‎ను ప్రశ్నించారు. విశ్వనగరం ఏమో కానీ, కనీసం విషవాయువులు లేని, కాలుష్య రహిత నగరంగా కూడా మార్చలేకపోతున్నారని ఆయన అన్నారు. స్థానిక ప్రజలు విశ్వ నగరాలు, అద్భుత ప్రపంచాలు కోరుకోవడం లేదని రేవంత్ అన్నారు. స్వచ్చమైన గాలి, మంచినీరు, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తే చాలనుకుంటున్నారన్నారు. జవహర్ డంపింగ్ యార్డు గురించి మీ దృష్టికి తీసుకొచ్చినా పరిష్కారం లభించకపోవడంతో.. స్థానిక ఎంపీనైన నా దృష్టికి తీసుకొచ్చారన్నారు. తక్షణం డంపింగ్ యార్డ్ తరలింపుపై ఓ నిర్ణయం తీసుకోకపోతే ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామని రేవంత్ హెచ్చరించారు.

For More News..

మోడీపై కేసీఆర్ యుద్దం ప్రకటిస్తారనుకున్నాం

జాతీయ రహదారిపై దర్జాగా రోడ్డు దాటుతున్న పులి

‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్