‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

బాహుబలి ‘ప్రభాస్’ అభిమానులకు మేకర్స్ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ తెరకెక్కిన పిరియాడీక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది. కరోనా కారణంగా గత కొన్నాళ్ల నుంచి వాయిదాపడుతున్న పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్, ఆచార్య, ఎఫ్ 3, సర్కార్ వారి పాట వంటి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. తాజాగా ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ను మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సినిమాకు సంబంధించిన ఓ థీమ్ పోస్ట‌ర్‎ను విడుదల చేసి.. మార్చి 11న  సినిమాను ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నట్లు తెలిపారు.

సీనియర్ యాక్టర్, రెబల్ స్టార్ కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద, భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాధ కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్.. విక్ర‌మాదిత్య అనే హ‌స్త సాముద్రికా నిపుణుడిగా విలక్షణ పాత్రలో కనిపించనున్నారు ప్ర‌భాస్. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేయడం విశేషం. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందించారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి.

For More News..

గుస్సాడీ కనక రాజుకు రివార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్