తెలంగాణ నిధులు, హక్కుల గురించి ఏనాడైనా మాట్లాడారా? : ఎంపీ చామల

తెలంగాణ నిధులు, హక్కుల గురించి ఏనాడైనా మాట్లాడారా? :  ఎంపీ చామల
  • బండి సంజయ్‌‌‌‌‌‌‌‌పై భువనగిరి ఎంపీ చామల ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, 420 హామీల గురించి ప్రశ్నించే ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌కు సిగ్గుండాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన బీజేపీ నేతలు రాష్ట్ర హక్కులు, నిధులను గాలికి వదిలేశారని విమర్శించారు. ఈ మేరకు ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మిగులు రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపాలు చేసినప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు.

తెలంగాణకు రావాల్సిన ట్రిపుల్ ఆర్, మెట్రో రెండో దశ, మూసీ పునరుజ్జీవం నిధుల గురించి మీరెప్పుడైనా మాట్లాడారా? కళ్ల ముందే బీఆర్ఎస్ నేతలు కమీషన్లు దండుకుంటుంటే, రోడ్లు, కాలువలు వదిలేస్తే ఎందుకు ప్రశ్నించలేదు? అని ఫైర్ అయ్యారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌‌‌‌లో జరిగిన అగ్నిప్రమాదం  వెనుక కేటీఆర్ హస్తం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.