ఫైవ్‌‌‌‌స్టార్ హోటళ్లలో గదుల రెక్కలకు రెక్కలు..ఒక్క నైట్‌‌‌‌కి రూ.4 నుంచి 5 లక్షలు

ఫైవ్‌‌‌‌స్టార్ హోటళ్లలో గదుల రెక్కలకు రెక్కలు..ఒక్క నైట్‌‌‌‌కి రూ.4 నుంచి 5 లక్షలు

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్  సమ్మిట్‌‌‌‌తో దేశ రాజధాని ఢిల్లీలో హోటల్ గదుల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఫైవ్‌‌‌‌స్టార్ హోటళ్లలో గదుల ధరలు, ఆక్యుపెన్సీ రేట్లు భారీగా పెరిగాయి. 

ఫిబ్రవరి 16–-20 మధ్య భారత్ మండపంలో జరగనున్న ఈ సమ్మిట్‌‌‌‌ కోసం  35 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. డిమాండ్ అధికంగా ఉండటంతో సాధారణంగా ఒక రాత్రికి రూ.20 వేల నుంచి రూ.40 వేల మధ్య ఉండే గదులు ఇప్పుడు లక్షల్లో, కొన్ని హోటళ్లలో ప్రత్యేక కేటగిరీల్లో రూ.4-–రూ.5 లక్షల వరకు చేరాయి. ఢిల్లీలోని లీలా ప్యాలెస్, ఐటీసీ మౌర్య, తాజ్ ప్యాలెస్ వంటి హోటళ్లు దాదాపు పూర్తిగా బుక్ అయ్యాయి. ఈ సమ్మిట్‌‌‌‌లో 100 దేశాల ప్రతినిధులు, 15-–20 దేశాధినేతలు, 50 పైగా మంత్రులు, 500 ఏఐ నిపుణులు పాల్గొననున్నారు.