నన్ను అక్రమంగా అరెస్టు చేశారు.. కోర్టులో పోరాడుతా: ఎమ్మెల్సీ కవిత

నన్ను అక్రమంగా అరెస్టు చేశారు.. కోర్టులో పోరాడుతా: ఎమ్మెల్సీ కవిత

లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు ఎమ్మెల్సీ కవిత. మార్చి 16 శనివారం ఉదయం వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించారు. కోర్టుకు చేరుకున్న క్రమంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తనను లిక్కర్ స్కామ్ లో కావాలనే ఇరికించారని మండిపడ్డారు. తన అరెస్టు అక్రమమన్నారు కవిత. ఈ కేసులో కోర్టులో పోరాడుతామని ఆమె చెప్పారు. కాగా, కవిత అరెస్టుపై మరికొద్దిసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.

 లిక్కర్ స్కాంలో మార్చి 15వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న అధికారులు.. రాత్రి సమయంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. రాత్రంతా ఈడీ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న కవితను.. మార్చి 16వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో.. జస్టిస్ ఎంకే నాగ్ పాల్ బెంచ్ ఎదుట హాజరుపరిచారు ఈడీ అధికారులు.కోర్టు ప్రాంగణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు