కార్మికుల హక్కులు కాలరాసేలా నల్ల చట్టాలు తెచ్చిన కేంద్రం

కార్మికుల హక్కులు కాలరాసేలా నల్ల చట్టాలు తెచ్చిన కేంద్రం

హన్మకొండ : కార్మికుల చెమట చుక్క విలువ తెలియని ప్రభుత్వాలు మనుగడ సాధించలేవని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వాలు ప్రజల్ని కళ్లలో పెట్టుకుని కాపాడుకోవాలని చెప్పారు. కాజీపేటలో కార్మిక ధర్మ యుద్ధం సభలో పాల్గొన్న కవిత.. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని సీఎం కేసీఆర్ కాపాడుతున్నారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు కార్మికుల హక్కులను కాలరాసేలా నాలుగు నల్ల చట్టాలు తెచ్చిందని మండిపడ్డారు. ఆ చట్టాలను రద్దు చేసే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

బ్రిటీష్ వారిని మించిపోయిన మోడీ సర్కారు కార్పొరేటు సంస్థలకు తొత్తుగా మారిందని లక్షల కోట్ల విలువ చేసే ఎయిరిండియాను వేలకోట్లకు అమ్మేసిందని కవిత ఆరోపించారు. అనుభవం లేకున్నా అన్ని సంస్థలను మోడీ తన మిత్రుడైన అదానీకి అమ్ముతున్నాడని విమర్శించారు. రైతు ఉద్యమ స్పూర్తితో బీజేపీ నల్లచట్టాలను రద్దు చేసే వరకు కార్మికులు పోరాడాలని కవిత పిలుపునిచ్చారు. ఇందుకోసం కేసీఆర్ జాతీయస్థాయిలో పోరాడేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న బీజేపీ ఎన్నికల తర్వాత ఆ హామీని మరిచిపోయిందని కవిత విమర్శించారు. మోడీ దేశంలో ఉంటే ఎలక్షన్ మోడ్, విదేశాల్లో ఉంటే ఏరోప్లేన్ మోడ్ తప్ప మరొకటి ఉండదని సటైర్ వేశారు. ప్రస్తుతం దేశానికి ప్రధాని మోడీనా లేక అదానీనా అన్నట్లుగా పరిస్థితి మారిందని కవిత వాపోయారు. 

For more news..

కాంగ్రెస్ పార్టీతో నా ట్రాక్ రికార్డు పాడైంది

బీజేపీ, కాంగ్రెస్లు అధికారంలోకి వస్తే మళ్లీ చీకటి రోజులు