కాంగ్రెస్ పార్టీతో నా ట్రాక్ రికార్డు పాడైంది

కాంగ్రెస్ పార్టీతో నా ట్రాక్ రికార్డు పాడైంది

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ వల్ల తన ట్రాక్ రికార్డు పాడైందని, ఆ పార్టీతో భవిష్యత్తులో కలిసి పనిచేసేది లేదని అన్నారు. బీహార్‌లోని వైశాలిలో ఉన్న దివంగత ఆర్జేడీ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ నివాసం నుంచి తన ‘జన్ సూరజ్ యాత్ర’ను మంగళవారం (మే31న) ప్రశాంత్ కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలతో కలిసి తాను పనిచేసిన అనుభవాలను, ఆయా పార్టీలు గెలుపొందిన విషయాన్ని ప్రస్తావించారు. 2017 యూపీ ఎన్నికలను కూడా ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ పార్టీ వల్లే తాను (వ్యూహకర్తగా) ఓడిపోయానన్నారు. దీంతో తన ట్రాక్ రికార్డు దెబ్బతిందని, వారితో పనిచేసేది లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ మెరుగయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు.

మహకూటమితో 2015లో బీహార్‌లో గెలిచామని, 2017లో పంజాబ్‌లో, 2019లో జగన్ మోహన్‌రెడ్డితో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో గెలిచామన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌తో 2020లో, 2021లో తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో గెలిచామని, 2017లో కాంగ్రెస్‌తో కలిసి యూపీలో ఓడిపోయామన్నారు. ఆ కారణంగానే కాంగ్రెస్‌తో కలిసి పని చేయరాదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు గౌరవం ఉందని, అయితే ప్రస్తుత పరిస్థితిలో ఆ పార్టీ తనంత తానుగా మెరుగయ్యే పరిస్థితి లేదని అన్నారు. అది (కాంగ్రెస్) మునుగుతూ తమను కూడా ముంచుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Congress may rope in strategist Prashant Kishor for Gujarat poll - The Week

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ ఇలాఖాలో సర్పంచుల నిరసన

బీజేపీ, కాంగ్రెస్లు అధికారంలోకి వస్తే మళ్లీ చీకటి రోజులు