కేసీఆర్ ఇలాఖాలో సర్పంచుల నిరసన

కేసీఆర్ ఇలాఖాలో సర్పంచుల నిరసన

సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే సర్పంచులు నిరసన చేపట్టారు. గతంలో చేసిన పల్లె ప్రగతి బిల్లులు రాక అప్పులపాలయ్యామంటూ సర్పంచుల నిరసన గళం విప్పారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్ లో పల్లె ప్రగతి  సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మండల పరిధిలోని 12 గ్రామాలకు సంబంధించిన సర్పంచులు హాజరయ్యారు. అయితే గతంలో చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాక అప్పులపాలయ్యామంటూ సర్పంచులు సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు.

అసలు మా ఎమ్మెల్యే ఎవరు..మా ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ ప్లకార్డులు పట్టుకుని ధర్నాకు దిగారు. తమ సమస్యలు చెప్పుకుందాం అంటే నాయకుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు విడతలుగా చేసిన పల్లె ప్రగతి పనులకు అప్పులు చేసి వడ్డీలు కడుతున్నామన్న సర్పంచులు ఐదో విడత పల్లె ప్రగతి పనులు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

బీజేపీ, కాంగ్రెస్లు అధికారంలోకి వస్తే మళ్లీ చీకటి రోజులు

బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు