బీజేపీ, కాంగ్రెస్లు అధికారంలోకి వస్తే మళ్లీ చీకటి రోజులు

బీజేపీ, కాంగ్రెస్లు అధికారంలోకి వస్తే మళ్లీ చీకటి రోజులు

తెలంగాణలో సర్కారు ఉద్యోగికి ఎంత డిమాండ్ ఉందో రైతుకు అంతే డిమాండ్ వచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు. గజ్వేల్ మహతి ఆడిటోరియంలో వానాకాలం సాగు సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గతంలో ఎండాకాలం వచ్చిందంటే రైతుల ఆత్మహత్యలు, ఆందోళనలు ఉండేవి కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. 24 గంటల కరెంట్,సాగు నీళ్లు, రైతు బంధు,రైతు బీమా వంటి ఎన్నో పథకాలు రైతులకు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.

కొందరు రైతుబీమాను రద్దు చేయాలని పిచ్చివ్యాఖ్యలు చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. రైతు బీమా అంటే రైతు ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని కానీ రైతు ఏ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాన్ని ఆదుకుంటున్నామన్నారు. దేశంలో అత్యధింగా రైతు ఆత్మహత్యలు తగ్గించిన రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం ప్రకటించినట్లు చెప్పారు. వరికంటే ఆయిల్ ఫామ్ సాగు వల్ల మూడురెట్ల లాభం వస్తుందని..ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలో కనీసం 25 వేళ ఎకరాల చొప్పున విత్తన సాగు చేపట్టాలని మంత్రి సూచించారు.

 నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచడం వల్ల అద్భుతాలు సృష్టించవచ్చని హరీష్ రావు అన్నారు. ములుగు రీసెర్చ్ సెంటర్ లో మిరపసాగు నారు పెద్ద ఎత్తున అందిస్తే రైతులకు మేలు జరుగుతుందని హరీష్ రావు తెలిపారు. గజ్వేల్, మెదక్ లో రాక్ పాయింట్ ఏర్పాటు చేసి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ మంత్రికి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ లు రైతులకు చేసింది శూన్యమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు అధికారంలోకి వస్తే మళ్లీ చీకరోజులు వస్తాయని మంత్రి విమర్శించారు. 

మరిన్ని వార్తల కోసం

బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు

సీఎం కేసీఆర్ ప్రజాసమస్యలను గాలికొదిలేశారు