సీఎం కేసీఆర్ ప్రజాసమస్యలను గాలికొదిలేశారు

సీఎం కేసీఆర్ ప్రజాసమస్యలను గాలికొదిలేశారు

దేశంలో రైతుల సంక్షేమానికి కేంద్రప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హయత్ నగర్ లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. పీఎం కిసాన్ 11వ విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. చేపలు, పాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ అగ్రభాగాన నిలిచినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 20లక్షల ఇల్లు కట్టించామని కేంద్రమంత్రి ప్రకటించారు.

రెండు లక్షల కోట్ల రూపాయలు నగదును ప్రజలకు అందజేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పది కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. 12కోట్ల మరుగుదొడ్లు కట్టించడంతోపాటు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఉచిత వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ కార్డులను తెలంగాణకు రానివ్వడం లేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ సచివాలయం రాకుండా ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లోనే ఉంటూ ప్రజా సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. 

మరిన్ని వార్తల కోసం

ట్రెండ్ సెట్టర్.. సూపర్ స్టార్ కృష్ణ 52 ఏళ్ల సినీ ప్రస్థానం

కృష్ణా నీళ్లు ఆంధ్రకు.. గోదావరి జలాలు కాంట్రాక్టర్లకు