లండన్​కు ఎమ్మెల్సీ కవిత

లండన్​కు ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీలో తెలంగాణ అభివృద్ధి మోడల్​పై ప్రసంగించేందుకు ఎమ్మెల్సీ కవిత ఆదివారం సాయంత్రం లండన్​కు బయల్దేరారు. శంషాబాద్​ ఎయిర్​పోర్టులో కార్పొరేషన్ ​చైర్మన్​లు మేడె రాజీవ్​సాగర్, అనిల్​ కూర్మాచలం, బీఆర్ఎస్​నాయకులు ఆమెకు వీడ్కోలు పలికారు. ‘‘ఎక్స్ ప్లోరింగ్ ఇన్ క్లూసివ్ డెవలప్మెంట్ : ద తెలంగాణ మోడల్’’ అనే అంశంపై సోమవారం నిర్వహించే సదస్సులో కవిత ప్రసంగించనున్నారు. 

వ్యవసాయం, కరెంట్, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఐటీ తదితర రంగాల్లో సాధించిన ప్రగతిపై ప్రజంటేషన్​ఇవ్వనున్నారు. రైతులకు పెట్టుబడిసాయం, 24 గంటల కరెంట్​తో రైతులు ఆర్థికంగా బలోపేతమవడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రీచార్జ్​అయ్యేలా కుల వృత్తులకు ప్రోత్సాహం.. మిగులు విద్యుత్​ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించడానికి పడిన కష్టం, మిషన్​కాకతీయ, మిషన్​భగీరథ, హైదరాబాద్​లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఆమె ప్రసంగించనున్నారు.