V6 News

నాపై ఎక్కువ మాట్లాడితే తోలు తీస్తా.. నేను టాస్ మాత్రమే వేశా.. ఇక మీ చిట్టా విప్పుతా: కవిత

నాపై ఎక్కువ మాట్లాడితే తోలు తీస్తా.. నేను టాస్ మాత్రమే వేశా.. ఇక మీ చిట్టా విప్పుతా: కవిత

తనపై ఎక్కువ తక్కువ మాట్లాడితే తోలు తీస్తానని చెప్పారు. తాను ఇప్పటి వరకు టాస్ మాత్రమే వేశానని, చిట్టా విప్పుతా నంటూ హరీశ్ రావు టార్గెట్ గా సంచలన వ్యా ఖ్యలు చేశారు. ముందు ముందు టెస్ట్ మ్యాచ్ ఉందని అన్నారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే మహే శ్వర్ రెడ్డి వెనుక ఉన్న గుంట నక్కను వదల బోనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మాధవరం కృష్ణారావు కుమారుడు చెరువు భూములు కబ్జా చేశారని ఆరోపించారు. చారు. మాధవరం కృష్ణారావు తాము దాడి చేసేంత అంత పెద్ద మనిషి కాదన్నారు.

 బీఆర్ఎస్ హయాంలో ఐదెకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్ ను రెసిడెన్షి యల్ భూమిగా మార్చుతూ అనుమతి ఇచ్చా రని అన్నారు. ఆ ల్యాండ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చిందని చెప్పారు. దీనిపైమాధవరం కృష్ణారావు సమాధానం చెప్పాల నిడిమాండ్ చేశారు. ఆ భూమికి సంబంధం ఉన్న ఏవీ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పార్ట్ నర్స్ అని, వీళ్లిద్దరూ నవనామీ వెంచర్స్ నడుపుతున్నారని క్లారిటీ ఇచ్చారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ కు ప్రధాన అనుచరుడని అన్నారు

హిల్ట్ పాలసీకి కిటీకీలు తెరిచిందే బీఆర్ఎస్

హెల్ట్ పాలసీకి కిటికీలు తెరచింది. బీఆర్ఎస్ సర్కారు అని, తర్వాత దర్వాజాలు తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే కవిత చెప్పారు. ప్రభుత్వ భూములకు సంతకాలు. పెట్టి ప్రయివేటు వ్యక్తులకు ఇచ్చారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న దొంగ దారులను రేవంత్ రెడ్డి రహదారులుగా మార్చారని ఆరోపించారు. 

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాను అని స్టేటెంట్ గా ఉన్నారని, తనకు ఎప్పుడే ఒకసారి టైం వస్తుందని, కచ్చితంగా ఒకరోజు ముఖ్యమంత్రి అవుతానని, అప్పుడు 2014 నుంచి జరిగిన అన్ని అంశాలపై విచారణ చేయిస్తానని ననారు. తాను, తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. తాను మంచిదాన్ని కాదని, తనను ఏమైనా అంటే ఊరుకోబోసని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు తెలిసి తప్పులు జరిగాయా లేదా...? అనేది కేసీఆరే చెప్పాలని కవిత అన్నారు.