సంతోష్ రావు దోస్త్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి.. రూ.750 కోట్లతో వెంచర్ వేశాడు : కవిత

సంతోష్ రావు దోస్త్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి.. రూ.750 కోట్లతో వెంచర్ వేశాడు : కవిత

ఎమ్మెల్సీ పదవికీ, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత.. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ సంతోష్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంతోష్ రావు కూరలో ఉప్పులాంటోడు.. చెడగొట్టే వ్యక్తి.. చెప్పులో రాయి.. చెవులో జోరీగా అంటూ విమర్శలకు దిగారు. సంతోష్ రావు దోస్త్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అని .. మోకిలాలో 750 కోట్ల రూపాయలతో వెంచర్ వేశారని సంచలన ఆరోపణలు చేశారు. 

ప్రెస్ మీట్ ఆద్యంతం హరీష్ రావు, సంతోష్ రావులనే టార్గెట్ చేసిన కవిత.. సంతోష్ ధనదాహం తీరనిదని సంచలన ఆరోపణలు చేశారు. సిరిసిల్లలో ఇసుక లారీ ఢీకొని దళిత బిడ్డ చనిపోతే.. గొడవ జరుగుతుంటే.. సీఎంవో ఆఫీసు నుంచి ఫోన్ చేసి.. ఏడుగురు దళిత బిడ్డలను కొట్టించాడని తెలిపారు. ఆ దళిత వ్యవహారం నెగెటివ్ అంతా కేటీఆర్ కు చుట్టుకుందని చెప్పారు. అతని వ్యవహారం కోసం ఈ మాటలు చెప్పానని అన్నారు. 

►ALSO READ  రామన్నా.. హరీశ్, సంతోష్ కుట్రలతో జాగ్రత్త : కవిత సంచలన కామెంట్స్

కేసీఆర్ హరితహారం పేరున భారీ ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం చేపడితే.. దానికి పోటీగా సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పెట్టారని విమర్శించారు కవిత.   జీవో అమెండమెంట్.. ఫొటోలకు ఫొజులు.. ఇచ్చి ఫారెస్ట్ కొట్టేయాలని ప్లాన్ చేశారని మండిపడ్డారు. 

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సంతోష్ బినామీ అని.. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు శ్రీమంతుడు అయ్యాడని ఆరోపించారు. వీళ్లిద్దరూ మోకిలాలో మెగా 750 కోట్ల రూపాయలతో మెగా ప్రాజెక్ట్ చేస్తున్నారని విమర్శలకు దిగారు.