
- నేడు షోలాపూర్ లో బతుకమ్మ వేడుకలు
- పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం మహారాష్ట్రలోని షోలాపూర్‌కు వెళ్లనున్నారు. పుంజాల్మైదాన్లో నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల్లో స్థానిక మహిళలతో కలిసి ఆమె పాల్గొంటారు. మహారాష్ట్ర బీఆర్ఎస్నేతలు నాగేశ్వల్యాల్, దశరథ్గోప్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్‌మార్గంలో కవిత బయల్దేరి మధ్యాహ్నం షోలాపూర్‌కు చేరుకుంటారు. నగరంలోని దత్తవాడలో బతుకమ్మ పేర్చి అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు శోభాయాత్రగా బతుకమ్మలను తీసుకొని అక్కల్కోట్ రోడ్డులోని పుంజాల్ మైదాన్‌కు చేరుకుంటారు.