ఎమ్మెల్సీ కవిత కేసు నవంబర్ 20కు వాయిదా

ఎమ్మెల్సీ కవిత కేసు నవంబర్ 20కు వాయిదా

సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ధాఖలు చేసిన  పిటిషన్ పై విచారణను 2023 నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అప్పటి వరకు ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కూడా నోటీసులు ఇవ్వొద్దని స్పష్టం చేసింది ధర్మాసనం.

ALSO READ : ఆస్తి వివరాలను కోర్టుకు సమర్పించిన హీరో విశాల్.. ఎందుకో తెలుసా?

ఈ సందర్భంగా కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది.  మహిళ అయినంత మాత్రాన విచారణ వద్దనలేమని వ్యాఖ్యానించింది . అయితే మహిళలకు కొన్ని  రక్షణలు కల్పించాల్సి ఉంటుందని పేర్కొంది. నవంబర్ 20 వరకు కవితకు సమన్లు కూడా ఇవ్వొద్దని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది.  కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనపై అసత్య ప్రచారం చేస్తోందని కవిత.. అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ ధాఖలు చేశారు.