ఆస్తి వివరాలను కోర్టుకు సమర్పించిన హీరో విశాల్.. ఎందుకో తెలుసా?

ఆస్తి వివరాలను కోర్టుకు సమర్పించిన హీరో విశాల్.. ఎందుకో తెలుసా?

తమిళ హీరో విశాల్‌(Vishal) తన ఆస్తులు, బ్యాంకు ఖాతాల వివరాలను కోర్టుకు సమర్పించారు. ఇందులో హీరో విశాల్‌ ఫైనాన్షియర్‌ అన్బచెలియన్‌ వద్ద నుండి రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నట్టు, ఆ మొత్తాన్ని లైకా సంస్థ(Lyca productions) చెల్లించినట్టుగా ఉంది. దానికి బదులుగా.. విశాల్‌ నిర్మించే సినిమా హక్కులను తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది లైకా సంస్థ. అయితే.. ఈ ఒప్పందాన్ని దాటి విశాల్‌ నటించి, నిర్మించిన వీరమే వాగై చుడుమ్‌ చిత్ర హక్కులను లైకాకు కాకుండా వేరే సంస్థకు ఇచ్చారు. దీంతో చైన్నె హైకోర్టును ఆశ్రయించింది లైకా సంస్థ.

ALSO READ : విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారా..? : టీఎస్‌పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం

ఈ కేసుపై పలు మార్లు చైన్నె హైకోర్టు ప్రత్యేక న్యాయస్థానంలో విచారణలు కూడా జరిగాయి. ఇందులో భాగంగా.. సెప్టెంబర్ 12న ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పీటీ ఉషా.. విశాల్‌ ఆస్తులను, బ్యాంక్‌ వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించించారు కానీ.. విశాల్ ఈ ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో 19వ తేదీన జరిగిన విచారణ సమయంలో దీన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

ఇక సోమవారం ఈ కేసు మరోసారి విచారణకు రాగా..విశాల్‌ తన ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించారు. అందులో స్టాండర్డ్‌ చార్టెడ్‌, ఐడిబీఐ, యాక్సెస్‌, హెచ్‌ డీ ఎఫ్‌ సీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకు ఖాతాల వివరాలు  ఉన్నట్లు సమాచారం. అయితే ఆ వివరాలు క్లియర్ గా లేకపోవడంతో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయాల్సిందిగా లైకా సంస్థను ఆదేశించిన న్యాయమూర్తి. ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేశారు.