- సీఎస్ సంజయ్ జాజుకు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వినతి
హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ-2003 ద్వారా ఎంపికైన టీచర్లందరికీ వెంటనే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సెక్రటేరియెట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును కలిసి టీచర్లు, ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు.
మోడల్ స్కూళ్ల రెగ్యులర్ టీచర్లను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌లో విలీనం చేసి, 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని కోరారు. మోడల్ స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీలు, సమగ్ర శిక్ష, యూఆర్ఎస్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు.
