- ఎమ్మెల్యే శంకరయ్యతో కుమ్మక్కై దాడులు చేస్తున్నరు
- నందిగామ సీఐ పద్ధతి మార్చుకోవాలి : ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి
షాద్‌నగర్, వెలుగు : ‘ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది.. ఆ తర్వాత మా సర్కార్ వస్తది.. అరాచకాలు సృష్టిస్తున్న వారిని వదిలేసి మాపై దాడులు చేస్తున్న పోలీసులను బట్టలు విప్పి కొడతాం.. నందిగామ సీఐ ప్రసాద్ పద్ధతి మార్చుకోవాలి.. ఎమ్మెల్యే శంకరయ్యతో కుమ్మక్కై మాపై దాడులు చేస్తున్నారు’ అంటూ మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌రెడ్డి ఫైర్ అయ్యారు. నందిగామ మండలం మొదల్లగూడెం లో గురువారం ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేటలో తన అనుచరులపై దాడులు చేయడం సరికాదన్నారు.
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో పాటు ఆయన కొడుకులు రవియాదవ్, మురళీయాదవ్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కుమ్మక్కై అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. ‘నందిగామ సీఐ ప్రసాద్‌కు బుద్ధి లేదు, బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక అతను ఏ బొక్కలో దాక్కున్నా పట్టుకొచ్చి బట్టలు విప్పి కొడుతాం’ అంటూ హెచ్చరించారు.
ఎల్గనమోని బ్రదర్స్‌పై కేసు...
షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కొడుకులు రవియాదవ్, మురళీ యాదవ్‌పై కేశంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి కేశంపేట మండలం ఎక్లాస్‌పేటలో దినేశ్ సాగర్, మధుసూదన్‌రెడ్డి, సుధీర్‌పై దాడి చేయడంతో పాటువాహనాలను ధ్వంసం చేశారు. దీంతో దినేశ్ సాగర్ ఫిర్యాదుతో రవియాదవ్, మురళీ యాదవ్‌పై కేసు నమోదవచేశారు.

