హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఈ–-వెస్ట్ మెగా కలెక్షన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 38 కలెక్షన్ పాయింట్లను ఏర్పాటు చేసి సుమారు 3.53 మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు.
వివిధ విభాగాలకు చెందిన సుమారు 71 రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రజల నుంచి సేకరించారు. ముఖ్యంగా మౌలాలి సర్కిల్ పరిధిలో అత్యధికంగా ఒక మెట్రిక్ టన్ను వ్యర్థాలు సేకరించారు.
