బ్యూటీ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లపై ఎంఎన్‌‌‌‌సీల కన్ను.. ఫండ్స్‌‌‌‌ సేకరణకు పెద్ద కంపెనీల వైపు స్టార్టప్‌‌‌‌ల చూపు

బ్యూటీ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లపై ఎంఎన్‌‌‌‌సీల కన్ను.. ఫండ్స్‌‌‌‌ సేకరణకు పెద్ద కంపెనీల వైపు స్టార్టప్‌‌‌‌ల చూపు

న్యూఢిల్లీ: ఇండియా బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ (బీపీసీ) స్టార్టప్‌‌‌‌లు కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. ఒకప్పుడు ఫండ్స్‌‌‌‌ సేకరించడానికి  ఐపీఓలను తమ ఫైనల్ టార్గెట్‌‌‌‌గా చూసేవి.  కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి మారుతోంది. ఫౌండర్లు స్టార్టప్‌‌‌‌ను ఏర్పాటు చేసి,  బ్రాండ్‌‌‌‌ను డెవలప్ చేస్తున్నాయి. డిమాండ్ పెరగగానే మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్‌‌‌‌సీ)లతో చేతులు కలుపుతున్నాయి. కొంత వాటాను వదులుకున్నా, పెద్ద కంపెనీల డిస్ట్రిబ్యూషన్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను వాడుకొని బిజినెస్‌‌‌‌ను మరింత పెద్దవిగా మారుస్తున్నాయి.

ఎంఎన్‌‌‌‌సీలు కూడా ఈ విధానానికి మొగ్గు చూపుతున్నాయి. సాధారణంగా ఒక బ్రాండ్‌‌‌‌ను డెవలప్ చేయడానికి  రీసెర్చ్ అండ్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం భారీగా ఖర్చు చేయాలి. అడ్వర్టయిజింగ్ చేయాలి. కన్జూమర్లను చేరుకోవాలి. అదే ఇప్పటికే  సక్సెస్ అయిన బ్రాండ్‌‌‌‌ కొంటే ఈ కంపెనీల టైమ్‌‌‌‌, మనీ రెంటూ ఆదా అవుతాయి.  

తాజా డీల్స్‌‌‌‌..

గ్లోబల్ బ్యూటీ కంపెనీ లోఓరియల్ ప్రముఖ ఇండియన్ పర్సనల్ కేర్ కంపెనీ ఇన్నోవిస్ట్‌‌‌‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తామని తాజాగా ప్రకటించింది. 2013లో ఈ కంపెనీ చెరియల్స్‌‌‌‌ కాస్మోటికల్స్‌‌‌‌ను కూడా కొనుగోలు చేసింది. హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌‌‌‌యూఎల్‌‌‌‌) సైన్స్-ఆధారిత స్కిన్‌‌‌‌కేర్ బ్రాండ్ మినిమలిస్ట్‌‌‌‌లో 90.5 శాతం వాటాను 2025 లో దక్కించుకుంది. ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌‌‌‌ను ఎస్టీ లాడర్ కొనుగోలు చేస్తామని ప్రకటించగా, ది మ్యాన్‌‌‌‌ కంపెనీని ఇమామీ 2024లో కొనుగోలు చేసింది. బియర్డో, జస్ట్‌‌‌‌ వెర్బ్స్‌‌‌‌ను  మారికో దక్కించుకుంది.

డిజిటల్ జోరు 

ఈ మార్పుకు ఆన్‌‌‌‌లైన్ కామర్స్, ఇన్‌‌‌‌స్టాగ్రామ్, యూట్యూబ్, క్విక్ కామర్స్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లు విస్తరించడమే ప్రధాన కారణం. ప్రస్తుతం యువత సంప్రదాయ ప్రకటనల కంటే యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్‌‌‌‌ను చూసి ప్రొడక్టులను కొంటోంది.  బేన్ అండ్ కంపెనీ పార్టనర్ రోహిత్ శంకర్  మాట్లాడుతూ, "భారతదేశంలో ప్రజల ఆదాయాలు, యువ జనాభా, డిజిటల్ అవగాహన పెరగడంతో  బీపీసీ మార్కెట్‌‌‌‌ వేగంగా విస్తరిస్తోంది. దాదాపు కోటి మంది డిజిటల్ బ్యూటీ ప్రియులు ఈ నయా ట్రెండ్‌‌‌‌ను నడిపిస్తున్నారు. 

కొన్ని ఆన్‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లలో జరిగే మొత్తం విక్రయాలలో 50 శాతానికి పైగా, గత ఐదేళ్లలో లాంచ్ అయిన సరికొత్త బ్రాండ్లవే ఉన్నాయి” అని అన్నారు. భారతదేశం కేవలం ఒక పెద్ద మార్కెట్ మాత్రమే కాదని, సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతోందని ఓరిఫ్లేమ్ ఇండియా హెడ్ ఎడిటా కురెక్  తెలిపారు.  ఇక్కడి కస్టమర్ల ప్రాధాన్యతలు ప్రపంచ బ్యూటీ ట్రెండ్స్‌‌‌‌ను ప్రభావితం చేస్తున్నాయనిఆయన వివరించారు.