
- = ఆపరేషన్ అభ్యాస్ పేరుతో నిర్వహణ
- = ఇండ్లలోకి పరుగులు తీసిన జనం
- = ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు
- = గోల్కొండ, కంచన్ బాగ్, మౌలాలి, సికింద్రాబాద్ లో సైరన్
- = అర్ధగంటపాటు నిర్వహించిన ఆఫీసర్లు
- = 1962 తర్వాత మళ్లీ ఇప్పుడు మాక్ డ్రిల్
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో నిర్వహించిన మాక్ డ్రిల్ విజయవంతం అయ్యింది. సాయంత్రం 4 గంటలకు వార్ సైరన్ మోగడంతో అందరూ ఇండ్లకు పరుగులు తీశారు. పోలీసులు సూచించిన విధంగా వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లోని గోల్కొండ, కంచన్ బాగ్, మౌలాలి, సికింద్రాబాద్ తదతర ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ లో ఎన్సీసీ కేడెట్లు కూడా పాల్గొన్నారు.
మొదట ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. మంటలు వస్తున్నప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పించారు. అదే విధంగా బిల్డింగుల్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పడులు అందులో చిక్కుకున్న వారిని ఎలా బయటికి తీసుకురావాలనే విషయంలో అవగాహన కల్పించారు. రోడ్లపై ఉన్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.
బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ మాక్ డ్రిల్ ను అధికారులు పరిశీలించారు. పోలీసులు, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ, స్థానిక అధికారులు ఈ మాక్ డ్రిల్ లో భాగస్వాములయ్యారు.
54 ఏండ్ల తర్వాత మాక్ డ్రిల్
దాదాపు 54 ఏండ్ల తర్వాత హైదరాబాద్ లో మాక్ డ్రిల్ నిర్వహించారు. 1962లో తొలిసారి ఇండో చైనా యుద్ధ సమయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న బోండీలా ప్రాంతాన్ని ఆనాడు చైనా సైన్యం దాటేసి భారత్‌లోకి చొరబడింది. పరిసర ప్రాంతాల ప్రజలంతా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని చైనా ఆర్మీ ప్రకటన విడుదల చేసింది.
►ALSO READ | ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండండి: CM రేవంత్
దీంతో అసోంలోని తేజ్‌పూర్‌కు చెందిన చాలామంది వ్యాపారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. తేజ్‌పూర్‌లోని జైళ్ల నుంచి ఖైదీలను, ఎల్‌జీబీఆర్ఐఎంహెచ్ పిచ్చాస్పత్రి నుంచి రోగులను విడుదల చేశారు. ప్రజలు ఎక్కడికక్కడ అసోం వర్ణమాలలోని ‘ డి’ ఆకారంలో బంకర్లు నిర్మించుకున్నారు.
అలాంటి పరిస్థితుల నడుమ అసోంలోని తేజ్‌పూర్‌లో భారత ప్రభుత్వ అధికారులు సైరన్లు మోగించి, యుద్ధ సమయంలో ఏమేం చేయాలో, ఎలా దాక్కోవాలో వివరించారు. చైనా యుద్ధ విమానాలకు ప్రజల నివాసాలు కనిపించకుండా ఉండేందుకు రాత్రివేళల్లో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు.