ఉప్పల్, ఎల్బీనగర్లో పనులు స్టార్ట్

ఉప్పల్, ఎల్బీనగర్లో పనులు స్టార్ట్

హైదరాబాద్ మహానగరాన్ని పట్టి పీడుస్తున్న సమస్య  ట్రాఫిక్. ఈ సమస్యకు చెక్  పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం,  జీహెంచ్ఎంసీ చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే  నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో  ఫ్లై ఓవర్లు నిర్మించారు. అయినప్పటికీ  ట్రాఫిక్ తగ్గకపోవడంతో మరో కొత్త  మోడల్ కు జీహెంచ్ఎంసీ  శ్రీకారం చుట్టింది. అదే మోడల్  కారిడర్లు.  సిటీలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ఈ మోడల్  వర్కౌట్ అవుతుందని జీహెంచ్ఎంసీ భావిస్తోంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన ఎల్బీనగర్  నియోజకవర్గంలో మోడల్ కారిడర్ అభివృద్ధి పనులను పురుపాలక శాఖ అధికారులు శుక్రవారం పరిశీలించారు.

ఉప్పల్ నుంచి ఎల్బీనగర్  వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా వెడల్పయిన ఫుట్ పాత్ లు, సైకిల్ ట్రాక్, గ్రీనరీ, స్ట్రీట్ ఫర్నీచర్, వంటివి ఏర్పాటు చేయనున్నారు.  కారిడర్ అభివృద్ధి పనులు  ఏప్రిల్ రెండోవారాని పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు.  ఉప్పల్, ఎల్బీనగర్  తో పాటుగా అన్ని జిల్లాలోని ప్రధాన రాహదారులను మోడల్ కారిడర్లుగా అభివృద్ధి చేయనున్నారు. పనులకు సంబంధించి టెండర్లు పిలిచినప్పటికి  ప్రస్తుతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో  కాంట్రక్టు ఏజెన్సీలతో ఒప్పందం నిలిచిపోయింది.