ఏప్రిల్ 7న మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్

ఏప్రిల్ 7న మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్
  •  నేటి నుంచి ఆన్​లైన్​లో  దరఖాస్తుల స్వీకరణ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో(2024–25) ప్రవేశాలకు సంబం ధించిన టెస్టుకు శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్ వెల్లడించారు. అప్లై చేసుకునేందుకు వచ్చే నెల 22 వరకు అవకాశం ఉందని తెలిపారు. ఏప్రిల్ 7న అడ్మిషన్ టెస్టు నిర్వహించనున్నట్లు చెప్పారు.  ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని క్లాసుల్లో సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. https://telanganams.cgg.gov.in వెబ్ సైట్ లో ఇన్​ఫర్మేషన్ బులిటెన్ రిలీజ్ చేస్తామని తెలిపారు. 

ఓసీ విద్యార్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ,  బీసీ, పీహెచ్ సీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.125 ఫీజు ఉంటుందన్నారు.స్టేట్ వైడ్ గా ఉన్న 194 మోడల్ స్కూళ్లల్లో ఆరో తరగతిలోనే 19,400 సీట్లున్నాయి. మిగిలిన ఏడు నుంచి పదో తరగతి వరకూ ఖాళీగా ఉన్న సీట్లను ఈ అడ్మిషన్ టెస్టు ద్వారా భర్తీ చేయనున్నారు.