బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కర్ణాటకలోని వేమగల్ వద్ద హెచ్ 125 హెలికాప్టర్ల అసెంబ్లీ లైన్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, ఎయిర్‌బస్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని నిర్మించాయి. ఈ ప్రాజెక్టు కోసం రూ.వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
దీని వల్ల యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో కూడా ఎగరగల సామర్థ్యం ఈ హెలికాప్టర్లకు ఉంది. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తారు. మేడ్ ఇన్ ఇండియా పేరుతో రూపొందే ఈ విమానాలు 2027 ఆర్థిక సంవత్సరం ఆరంభంలో అందుబాటులోకి రానున్నాయి. ఇవి సైనిక అవసరాలు, పౌర సేవలకు ఉపయోగపడతాయి.
