కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో అన్యాయం: మోడీ

కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో అన్యాయం: మోడీ

దేశాన్ని రక్షించడమే తెలియని వారు అభివృద్ధిఎలా చేస్తారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు.కాంగ్రెస్ ​నేతలు అప్పుడప్పుడు, అదీ పొరపాటున నిజాలు మాట్లాడతారని ఎగతాళి చేశారు. కాంగ్రెస్​పార్టీ, వంచన రెండూ మంచి దోస్తులని, ‘అబ్ హో గాన్యాయ్’ దీనికి చక్కని ఉదాహరణ అన్నారు . ఇప్పుడు న్యాయం జరుగుతుందంటే, అరవై ఏళ్ల కాంగ్రెస్​పాలనలో అన్యాయం చేసినట్లే కదా అని ప్రశ్నించారు. శనివారం తమిళనాడులోని థేని జిల్లా అండిపట్టి, రామనాథపురం, కర్నాటకలోని మంగళూరులో నిర్వహించిన పార్టీ ప్రచార సభల్లో మోడీ పాల్గొన్నారు. యూపీఏ పాలనలో దేశం వణికిపోయిందని,టెర్రర్ దాడులతో ప్రజలు ఆందోళనతో జీవిం చారనిఅన్నారు . సిక్కుల ఊచకోత, భోపాల్ గ్యాస్ దుర్ఘటన,దళితులపై హింస లాంటి సంఘటనలన్నీ యూపీఏ హయాంలోనే జరిగాయన్నారు . తాము అధికారంలోకొచ్చాక టెర్రర్ దాడులను ఎదుర్కొన్నామని చెప్పారు .

వాళ్లు మహానేతలు..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు జయలలిత,ఎంజీఆర్ ముందు చూపున్న నేతలంటూ మోడీ కొనియాడారు. వాళ్లు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో చాలామంది పేదరికం నుంచి బయటపడ్డారని కీర్తించారు. థేని జిల్లా వీరులకు పుట్టినిల్లని,ఇక్కడి నుంచి ఎంతోమంది సైన్యంలో చేరి దేశ సేవచేస్తున్నారని మోడీ చెప్పారు. జవాన్ల త్యాగం తమకుతెలుసని చెబుతూ.. దేశ రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాము రాజీపడబోమని తేల్చి చెప్పారు .పెరుంగమనల్లూర్ అమరులకు మోడీ నివాళులు అర్పించారు.

రక్షణలోనూ రాజకీయమే..

కీలకమైన దేశ రక్షణ విషయాన్నీ కాంగ్రెస్​ రాజకీయంచేస్తోందని మోడీ విమర్శించారు. బాలాకోట్ సర్జికల్స్ట్రైక్స్ ను, సైనికుల ధైర్యసాహసాలను అవమానిస్తోందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఎన్డీఏ సర్కారు కావాలో, టెర్రరిస్టు గ్రూపులకు అనుకూలంగా మాట్లాడే కాంగ్రెస్ ​కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు.

వాళ్లది వంశోద్ధరణ..

మాది దేశోద్ధరణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్​కూటమి దొందూ దొందేనని, వారసత్వ రాజకీయాల్లో రెండు పార్టీలూ తీసిపోవని మోడీ విమర్శించారు.శనివారం మంగళూరులో నిర్వహించిన ప్రచారర్యాలీలో ఆయన మాట్లాడారు. వారసత్వ రాజకీయాలను వారు ఆదర్శంగా తీసుకుంటే, జాతీయత వాదాన్ని తాము ఆదర్శంగా తీసుకున్నామని మోడీచెప్పారు. వంశోద్ధరణకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు.