
- బీజేపీపై విమర్శలు చేసిన కాంగ్రెస్
- ఖాళీగా ఉంటే ఉద్యోగాలు అడుగుతారన్న భయం
న్యూఢిల్లీ: పబ్‌జీ బ్యాన్ చేస్తే దేశంలోని యువత ఖాళీగా ఉండి.. బీజేపీని ఉద్యోగాల కోసం డిమాండ్ చేస్తారనే భయంతో దానిపై బ్యాన్ విధించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ విమర్శించారు. రెండో విడతలో 47 చైనా యాప్‌లపై బ్యాన్ విధించిన అంశంపై ఆయన స్పందించారు. “ నిజానికి మోడీ ప్రభుత్వం పబ్‌జీని బ్యాన్ చేయాలని డిసైడ్ అయింది. కానీ యువత ఖాళీగా ఉంటే ఉద్యోగాలు అడుగుతారు అని ఆలోచించింది. ఫ్యాంటసీ వరల్డ్ నుంచి డైవర్ట్ చేస్తే రియల్ వరల్డ్ విషయాలను అడుగుతారు. అది పెద్ద ఇష్యూ అవుతుంది” అని అభిషేక్ మనూ అన్నారు. ఇండియా – చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చైనాకు చెందిన 59 యాప్స్‌ను చేసిన ప్రభుత్వం ఇప్పుడు రెండో విడతలో భాగంగా మరో 49 యాప్స్‌ను బ్యాన్ చేసింది. కాగా.. చైనాతో సంబంధం ఉన్న 200 యాప్స్‌పై దృష్టి సారించిందని, దాంట్లో ఫేమస్ యాప్ పబ్‌జీ కూడా ఉన్నట్లు సమాచారం. ఇండియాలో పబ్‌జీకి కోట్లాది మంది యువత పబ్‌జీ గేమ్‌కి అభిమానులు.